గండిపేట మండలం పుప్పాల్‌గూడ నార్సింగి పరిధిలోని ముష్కిన్ చెరువు ఆక్రమణలపై శనివారం ఉక్కుపాదం మోపింది. సుమారు 5,500 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడేందుకు హైడ్రా కమిషనర్ రంగంలోకి దిగి, చెరువు మధ్యలో నిర్మించిన అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల కింద చెరువును అభివృద్ధి చేస్తామంటూ ముందుకు వచ్చి, అసలు కథ నడిపింది. చెరువు మధ్యలో ఏకంగా ఒక ఆనకట్ట వంటి కట్టడాన్ని నిర్మించి, సుమారు 34.21 ఎకరాల జలవనరును ఆక్రమించుకునేందుకు ప్రయత్నించింది.