పశ్చిమ బెంగాల్ మాజీ సిఎం మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపి అభిషేక్ బెనర్జీపై దాడి జరిగింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో బాధితులను పరామర్శించేందుకు సోనార్‌పుర్ వెళ్లిన ఆయనపై స్థానికులు రాళ్లు, కోడిగుడ్లు, చెప్పులు విసిరారు. కొందరు ఆయనపై చేయి చేసుకున్నారు. అభిషేక్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. భద్రతా సిబ్బంది ఆయనకు రక్షణగా నిలిచారు. అనంతరం చిరిగిన చొక్కాతో ఆ ప్రాంతం నుంచి వెళ్లిపోయారు.

