కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ జూన్ 3వ తేదీన సాయంత్రం 4.05 గంటలకు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు లోక్భవన్ ప్రకటన విడుదల చేసింది. లోక్ భవన్ ప్రాంగణంలోనే ఈ కార్యక్రమం జరగనుంది. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ తనకు రాసిన లేఖ అందిందని గవర్నర్ పేర్కొన్నారు. అంతకుముందు పార్టీ శాసనసభా పక్ష సమావేశంలో డీకే. శివకుమార్ ను తమ నాయకుడిగా ఎన్నుకుంటూ ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మాజీ సీఎం సిద్ధరామయ్యనే ఈ తీర్మానాన్ని ప్రతిపాదించడం గమనార్హం.