కర్ణాటక ముఖ్యమంత్రి గా పగ్గాలు చేపట్టబోతున్న డీకే శివకుమార్ తన క్యాబినెట్లో నలుగురు ఉప ముఖ్యమంత్రుల ప్రతిపాదనకు నో చెప్పారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ విషయంలో తన నిర్ణయాన్ని ఆయన అధిష్ఠానానికి తెలియజేశారు. కర్ణాటక కాంగ్రెస్లో చాలామంది సీనియర్లు ఉన్నందున కొందరిని మాత్రమే ఉపముఖ్యమంత్రులుగా ఎంపిక చేయడంవల్ల పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి తలెత్తవచ్చని పార్టీకి ఆయన వివరించినట్టు తెలుస్తోంది.

