అత్యంత ఆధ్యాత్మిక భావన కల్గిన డీకే శివకుమార్.. తన వ్యక్తిగత జ్యోతిష్కుడు బెల్లూరు ద్వారకానాథ్ సలహా మేరకు జూన్ 3వ తేదీని ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా ఆరోజు మంచి రోజు ఉందని జ్యోతిష్యుడు చెప్పగా.. దాన్నే ఖాయం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ తేదీనే ఎంచుకోవడానికి మరో ముఖ్య కారణం కూడా ఉంది. అదేంటంటే.. కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోజు అందుబాటులోలో ఉండనున్నారట.