ఒక మీడియా సమావేశంలో సోము వీర్రాజు మాట్లాడుతూ ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావుపై వ్యక్తిగతంగా, రాజకీయంగా కఠిన పదజాలంతో విరుచుకుపడ్డారు. “ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు ఎంతమాత్రం మేధావి కాదు.. ఆయన ఒక కరుడుగట్టిన తీవ్రవాది, నక్సలైట్” అంటూ సంచలన ఆరోపణలు చేశారు. నిరంతరం బీజేపీ విధానాలను తప్పుబడుతూ, పార్టీకి వ్యతిరేకంగా పని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తి అంటూ ఆయన మండిపడ్డారు. రాజకీయ సమీకరణాలను అర్థం చేసుకోకుండా కేవలం విమర్శల కోసమే నాగేశ్వర్ రావు మాట్లాడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.