‘జీవ నదులను మన చేతులారా చంపేస్తున్నాం. నదులను మృత నదులుగా మారిస్తే భవిష్యత్తు ఉండదు’అని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.‘గోదావరి కాలుష్య నివారణకు అంతర్ శాఖల (జిల్లా) టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. కాలుష్య నియంత్రణ చర్యలకు రూ.100 కోట్లు బడ్జెట్ నిధులు కేటాయిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో గోదావరి నది కాలుష్యం, పుష్కరాల సన్నద్ధతపై పీసీబీ, అటవీ- ర్యావరణ శాఖ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు, జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిoచారు.