జగిత్యాలలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జగిత్యాలలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా చేస్తుండగా అదే మార్గంలో వస్తున్న ఓ ఆర్టీసీ డ్రైవర్ వారికి ఝలక్ ఇచ్చాడు. పెట్రోల్, డీజిల్ రేట్ల గురించి ఆందోళ తర్వాత చేయొచ్చు కానీ.. ముందు వడ్లు, మక్కలు కొనట్లేదు.. ముందు వాటి గురించి పట్టించుకోండి.. అంటూ సదరు ఆర్టీసీ డ్రైవర్ వారికి చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.