ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 అరుదైన ఘనత సాధించింది. చంద్రయాన్-3కి ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. ఈ ప్రాజెక్టుకు అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ 2026 గాడార్డ్ ఆస్ట్రోనాటిక్స్ అవార్డు అందించింది. AIAA ASCEND 2026 సదస్సులో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన ఇస్రో తరపున అమెరికాలోని భారత రాయబారి వినయ్ క్వాత్రా ఈ అవార్డును అందుకున్నారు. 2023 ఆగస్టు 23న చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువం సమీపంలో సాఫ్ట్ ల్యాండింగ్ సాధించిన మొదటి అంతరిక్ష నౌకగా చరిత్ర సృష్టించింది.