మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పెద్ది’ పై రోజురోజుకీ అంచనాలు మరింత పెరుగుతున్నాయి రేపు భోపాల్లో భారీ స్థాయిలో సంగీత వేడుక జరగనున్న నేపథ్యంలో చిత్రబృందం అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది. సినిమాలోని ప్రత్యేక గీతం “హెల్లల్లలో” అనే పాటకి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. ఇందులో రామ్ చరణ్, శృతి హాసన్ స్టెప్పులకి ఫ్యాన్స్కి మాంచి కిక్ ఇచ్చాయి. ఫుల్ సాంగ్ మే 23న రానుంది.