ముంబైలోని బాంద్రా రైల్వే స్టేషన్ పరిసరాల్లో చాన్నాళ్లుగా తిష్టవేసిన అక్రమ చొరబాటుదారుల బంగ్లాదేశ్, రోహింగ్యా శరణార్థుల స్థావరాలను అధికారులు ఎట్టకేలకు నేలమట్టం చేశారు. ఇక్కడ నివసించే కొందరి వల్ల దౌర్జన్యాలు, దొంగతనాలు, మహిళల పట్ల అసభ్య ప్రవర్తన, డ్రగ్స్ పెరిగిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడి నివాసితులు గుంపులు గుంపులుగా ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. అయితే వీరంతా స్వదేశానికి వెళ్లకుండా దేశంలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.