కాక్రోచ్ జనతా పార్టీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లలో ఎక్కువ మంది పాకిస్థాన్, బంగ్లాదేశ్, అమెరికా నుంచి ఉన్నారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. ఓ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పోస్టుకు కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ అభిజీత్ దిప్కే బదులిచ్చారు. బీజేపీ ఇడియట్స్ మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ముందు సీజేపీ ఆడియన్స్ గణాంకాలు అంటూ.. తమ ఫాలోవర్ల లొకేషన్‌కు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను ఆయన షేర్ చేశారు. దీని ప్రకారం సీజేపీ ఇన్‌స్టా అకౌంట్ ఫాలోవర్లలో 94.7 శాతం మంది ఇండియా నుంచే ఉన్నారు.