దేశంలో పెరుగుతున్న దిగుమతుల భారాన్ని తగ్గించే ఉద్దేశంతో వెండి దిగుమతులపై నిఘా పెంచేందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (DGFT) తాజాగా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. వెండి బార్లు, పూర్తిగా తయారవ్వని ముడి వెండి, పొడి రూపంలో ఉన్న వెండిని విదేశాల నుంచి తీసుకురావాలంటే ఇకపై ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇప్పటివరకు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా స్వేచ్ఛగా వీటిని దిగుమతి చేసుకునే అవకాశం ఉండేది. కానీ తాజా ఆదేశాలతో వ్యాపారులు విధిగా ప్రభుత్వ లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.