ఏపీలో నిన్న జరిగిన కేబినెట్ లో సీఎం చంద్రబాబు సైతం వారంలో ఒకరోజు సచివాలయానికి సైకిళ్లపై వచ్చేలా ప్లాన్ చేయాలని సూచించారు. దీనిపై విమర్శలు మొదలయ్యాయి. అయ్యా చంద్రబాబు గారూ.. సైకిళ్లపై సచివాలయానికి వెళ్లే నాటకీయం చేయాల్సిన అవసరం లేదు గానీ, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు, మీ మంత్రులు, మీ పార్టీ నాయకులు ప్రత్యేక విమానాల్లో ప్రయాణాన్ని తక్షణమే నిషేధిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వండి, వాటిని కఠినంగా పాటించండి అంటూ సీబీఐ మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావు చురకలు అంటించారు.