సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చపై స్పందిస్తూ రష్మీ ఒక సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. అందులో తన రాజకీయ వైఖరిని స్పష్టం చేశారు. “అవును, నేను భారతీయ జనతా పార్టీకి, ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతు ఇస్తాను” అని ఆమె నిస్సంకోచంగా ప్రకటించారు. పార్టీకి మద్దతు ఇస్తున్నంత మాత్రాన అపరాధాలను సమర్థించనని చెబుతూ.. “నేను మోదీకే సపోర్ట్ చేస్తాను తప్ప, రేపిస్టులకు లేదా లైంగిక వేధింపులకు పాల్పడేవారికి కాదు” అని కుండబద్ధలు కొట్టారు. తన రాజకీయ మద్దతును సామాజిక నేరాలతో ముడిపెట్టవద్దని కోరారు.

