తమిళనాడులో ఎన్నికలు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో విపక్ష అన్నాడీఎంకే నిట్టనిలువుగా చీలిపోయింది. విజయ్ కు మద్దతుగా నిలిచేందుకు అధినేత పళనిస్వామి సహకరించకపోవడంతో కొత్తగా ఎన్నికైన
మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనపై అసంతృప్తితో వేరు కుంపటి పెట్టుకున్నారు. ప్రస్తుతం షణ్ముగం, వేలుమణి నేతృత్వంలోని తిరుగుబాటు వర్గానికి సుమారు 30 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. పళనిస్వామిని ప్రతిపక్ష నాయకుడిగా, శాసనసభ పక్ష నాయకుడిగా ప్రతిపాదనకు 30 మంది ఎమ్మెల్యేలు ఆ లేఖపై సంతకం చేయలేదు.