ప్రజలు త్యాగాలు చేయాలంటూ ప్రధాని మోదీ చేసిన విజ్ఞప్తిపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. “నిన్న మోదీజీ ప్రజలను త్యాగాలు చేయమని అడిగారు. బంగారం కొనొద్దు, విదేశాలకు వెళ్లొద్దు, పెట్రోల్ వాడకం తగ్గించండి అన్నారు. ఇవి కేవలం ఉపన్యాసాలు కాదు.. 12 ఏళ్ల పాలనలో దేశాన్ని ఆయన దిగజార్చిన స్థితికి రుజువులు” అని పేర్కొన్నారు. ఒక ‘కాంప్రమైజ్డ్ ప్రధాని’ దేశాన్ని నడిపించడం ఇక సాధ్యం కాదని ఆయన ఘాటుగా విమర్శించారు.

