నిజామాబాద్ జిల్లాలో హనీ ట్రాప్ వ్యవహారం కలకలం రేపింది. నాందేడ్ కు చెందిన భార్యాభర్తలు పధకం ప్రకారం యువకులను టార్గెట్ చేస్తూ హనీ ట్రాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బైపాస్ చౌరస్తా ప్రాంతంలో వాహనదారులను ఆకర్షించి, అనంతరం డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు దంపతులపై నిఘా పెట్టి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మొత్తం వ్యవహారం సీసీటీవీ కెమెరాలలో రికార్డ్ అయినట్లు పోలీసులు తెలిపారు.

