ఉత్తరప్రదేశ్లో ఈదురుగాలులతో కూడిన భారీ తుఫాను తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ధూళి తుఫాను బీభత్సం సృష్టించింది. అత్యధికంగా ప్రయాగ్రాజ్ జిల్లాలో 16 మంది మృతి చెందగా, భదోహీలో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫతేపూర్ జిల్లాలో 9 మంది మరణించగా, ఇతర జిల్లాల్లో కూడా పలువురు గాయపడినట్లు సమాచారం. గాలివాన తీవ్రతకు కొందరు చెట్ల కింద చిక్కుకోగా, మరికొందరు గోడలు, ఇళ్ల పైకప్పులు కూలిపోవడంతో మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

