కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన పోక్సో కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేస్తూ సైబరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు. కూకట్ పల్లి డీసీపీ రితి రాజ్ ఆధ్వర్యంలో పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో నమోదైన పోక్సో కేసు విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. భగీరథ్ వ్యవహారం గత మూడు రోజులుగా చర్చనీయాంశంగా మారగా.. సీఎం రేవంత్ రెడ్డి డీజీపీకి ఫోన్ చేసి జాప్యం చేయొద్దని ఆదేశించడంతో, వెంటనే సిట్ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

