దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్ యూజీ-2026 (NEET UG-2026) పరీక్ష అక్రమాల ఆరోపణలతో వివాదంలో చిక్కుకుంది. రాజస్థాన్, డెహ్రాడూన్ ప్రాంతాలలో పోలీసులు ముమ్మర దాడులు నిర్వహించి, ఇప్పటివరకు 13 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పరీక్షకు ఒకరోజు ముందే సోషల్ మీడియా, ఇతర మార్గాల్లో ఒక ‘గెస్ పేపర్’ సర్క్యులేట్ అయినట్లు అధికారులు గుర్తించారు. అసలు ప్రశ్నపత్రంతో ఈ గెస్ పేపర్‌ను సరిపోల్చగా, అధికారులు విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా బయాలజీ, కెమిస్ట్రీ విభాగాల్లో 100కు పైగా ప్రశ్నలు యథాతథంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు.

