పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో జరిగిన అవకతవకలే బెంగాల్‌లో బీజేపీ గెలుపునకు ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు. ‘బెంగాల్‌లో బీజేపీ సుమారు 30 లక్షల ఓట్ల తేడాతో గెలిచింది. ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయిన వారి సంఖ్య కూడా దాదాపు అంతే ఉంది. ఇప్పుడు చెప్పండి, ఇది పూర్తిగా న్యాయమైన, ప్రజాస్వామ్యబద్ధమైన ప్రక్రియేనా..? ఇదే నా ప్రశ్న..’ అని థరూర్ అన్నారు.

