కోనసీమ జిల్లాలో పెళ్లి విందు విషాదాన్ని నింపింది. జిల్లాలోని కొత్తపేట మండలం రామ్మోహన్ రావుపేట లో వివాహ వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన భోజనాలు తిన్న అతిథులు ఒక్కసారిగా అస్వస్థతకు లోనయ్యారు.
ఫుడ్ పాయిజన్ కావడంతో సుమారు 43 మంది వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడ్డారు. బాధితుల్లో చిన్న పిల్లలు, మహిళలు కూడా ఉండటంతో గ్రామంలో ఒక్కసారిగా కలకలం రేగింది. బాధితుల పరిస్థితిని గమనించిన బంధువులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు.