సుమారు 28 మంది అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు పుదుచ్చేరిలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో మకాం వేయడం సంచలనంగా మారింది. సీనియర్ నేత సి.వి. షణ్ముగం నేతృత్వంలోని ఈ బృందం టీవీకేకు మద్దతు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. తమిళ రాజకీయాల్లో ఈ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి.టీవీకే, అన్నా డీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మధ్య అధికార పంపకాలపై ఒప్పందం కుదిరినట్లు సమాచారం. సీనియర్ నేత సి.వి. షణ్ముగానికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని టీవీకే ప్రతిపాదించింది.