loader

‘జంతువును మంత్రిని చేస్తే ఇలాగే మాట్లాడుతుంది..’ కరాటే కల్యాణి

సినీ నటి, బిగ్‌బాస్ ఫేమ్ కరాటే కళ్యాణి తెలంగాణ అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ ను ఉద్దేశించే ఆమె ఈ పోస్టు పెట్టినట్లు జోరుగా చర్చజరుగుతోంది. ‘జై శ్రీరామ్ అంటే పై నుంచి డబ్బులు పడతాయా?’ మంత్రి కొండా సురేఖ ఇటీవల వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కరాటే కల్యాణి ఫేస్‌బుక్‌లో ‘కొండల్లో ఉండాల్సిన జంతువును దేవాదాయశాఖ మంత్రిగా చేశారు. మరి ఇంకేం మాట్లాడుతుంది. పెనుకు పెత్తనం ఇస్తే బుర్ర కొరిగింది అంట.. […]

బీహార్ మంత్రివ‌ర్గంలోకి నితీశ్ కుమార్ కుమారుడు.. ప్ర‌మాణం చేసిన నిషాంత్ కుమార్

బీహార్‌లో మంత్రిమండ‌లిని విస్త‌రించారు. కొత్త‌గా ఇవాళ 31 మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ త‌న‌యుడు నిషాంత్ కుమార్ కూడా ప్ర‌మాణ స్వీకారం చేసిన వారిలో ఉన్నారు. పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఈ కార్య‌క్ర‌మం జ‌రిగింది. బీహార్‌లో అయిదు పార్టీల ఎన్డీఏ కూట‌మి ప్ర‌భుత్వాన్ని నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. గ‌వ‌ర్న‌ర్ లెఫ్టినెంట్ జ‌న‌ర‌ల్ స‌య్య‌ద్ అతా హ‌స్నైని మంత్రుల చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు.

2027 నాటికి క్లీన్ స్వీప్.. భూ రికార్డులపై సీఎం కీలక ఆదేశాలు!

పాలనలో ప్రజల సంతృప్తి స్థాయిని పెంచాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి ఆదేశించారు. 2027 మార్చి నాటికి రెవెన్యూ రికార్డులు పూర్తిగా ప్రక్షాళన కావాలని, భూముల విషయంలో ‘జీరో ఎర్రర్’ ఉండాలని స్పష్టం చేశారు. ఆర్థికేతర ఫిర్యాదులను తక్షణం పరిష్కరించాలని, పబ్లిక్ రిలేషన్స్‌తో పాటు పబ్లిక్ డెలివరీ కూడా ముఖ్యమని సూచించారు. అధికారులంతా క్షేత్రస్థాయిలోకి వెళ్లాలని, కార్యదర్శులు 3 రోజులు, కలెక్టర్లు 8 రోజులు ఫీల్డ్ వర్క్ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో […]

గవర్నర్‌ తీరు.. ప్రజాతీర్పును అవమానించడమే: కమల్‌హాసన్‌

తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటు వ్యవహారంలో గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ తీరును ప్రముఖ నటుడు, మక్కళ్‌ నీది మయ్యం అధ్యక్షుడు కమల్‌ హాసన్‌ తప్పుపట్టారు. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకేను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించకపోవడం.. ప్రజాతీర్పును అవమానించడమేనని వ్యాఖ్యానించారు. మెజార్టీని లోక్‌భవన్‌లో కాదని.. అసెంబ్లీలో నిరూపించుకోవాల్సి ఉంటుందన్నారు. తమిళనాడు ప్రజల తీర్పును గవర్నర్‌ గౌరవించాలని కోరారు.

ఆర్‌జీ కార్ బాధితురాలి ఇంటి సమీపంలో బాంబు దాడి.. ఐదుగురు బీజేపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలు

పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ హింస మరోసారి పరాకాష్ఠకు చేరింది. ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పానిహతి ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుండగులు జరిపిన బాంబు దాడిలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన ప్రాంతం ఆర్‌జీ కార్ అత్యాచార బాధితురాలి తల్లి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే రత్న దేబ్నాథ్ నివాసానికి సమీపంలో ఉండటంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోంది.

విజయ్ కు మళ్లీ గవర్నర్ షాక్..! రెండోసారీ నిరాశే..!

తమిళనాడు లోక్ భవన్ వర్గాల సమాచారం మేరకు టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే ప్రయత్నంపై గవర్నర్ సంతృప్తి చెందలేదు. అలాగే ఆ పార్టీ 118 సీట్ల మెజార్టీ మార్కును నిరూపించుకోవాలని కోరారు.చిన్న పార్టీలు మద్దతు ఇవ్వవచ్చనే ఊహతో విజయ్ తన వాదనను వినిపిస్తున్నారా అని గవర్నర్ ఆయన్ను ప్రశ్నించారు. అలాగే ప్రభుత్వ స్థిరత్వాన్ని కూడా ప్రశ్నించారు. సభలో మెజారిటీని ఎలా నిరూపించుకుంటారో, అలాగే తనకు మద్దతు ఇస్తున్నట్లు సూచించిన పార్టీల నుండి మద్దతు లేఖలను చూపించాలని గవర్నర్ […]

“దళపతిని అభిమన్యుడిని చేశారు” -పోసాని ఫైర్

నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి మండిపడ్డారు. విజయ్ పై భారీ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. విజయ్ ది అధికారం కోసం పాకులాడే మనస్తత్వం కాదని పోసాని తెలిపారు. కానీ ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేయకుండా కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దళపతి అయిన విజయ్ ను అభిమన్యుడిని చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. విజయ్ తనకు 1996 నుంచీ తెలుసని, విజయ్ చుట్టూ ఎన్నో గొడవలు ఉన్నా సంయమనంతో ఉన్నాడన్నారు. అయినా ఆయనపై కుట్రలు చేస్తున్నారని విమర్శించారు.

ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డి కారుపై బీజేపీ నేతల దాడి.. కరీంనగర్‌లో ఉద్రిక్తం

కరీంనగర్‌ పట్టణంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ క్యాంప్ ఆఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. కిటికీల అద్ధాలు పగులగొట్టారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. కౌశిక్‌ రెడ్డిపై సైతం దాడికి యత్నించారు.

పిఠాపురం టీడీపీలో కీలక మార్పులు.. ఇన్‌చార్జ్ బాధ్యతల నుంచి వర్మ తొలగింపు

పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలోకీలక మార్పులు చోటుచేసుకున్నాయి. పిఠాపురం నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ బాధ్యతల్లో ఆ పార్టీ హై కమాండ్ మార్పు చేసింది. ప్రస్తుత ఇన్‌చార్జ్, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSN వర్మను ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. త్వరలో నియోజకవర్గ పార్టీ వ్యవహారాల నిర్వహణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామని తెలిపింది.

సీఎంగా విజయ్..గవర్నర్ ఆమోదం-ప్రమాణ స్వీకారం..కండీషన్స్ అప్లై!!

ఎట్టకేలకు విజయ్ ముఖ్యమంత్రి అవ్వటం ఖాయమైంది. తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారానికి లైన్ క్లియర్ అయింది. రెండు రోజులుగా సాగుతున్న సస్పెన్స్ కు తెర పడింది. ఈ రోజు గవర్నర్ తో విజయ్ మరోసారి భేటీ అయ్యారు. తనకు ఉన్న సంఖ్యా బలం గురించి వివరించారు. తనకు అవకాశం ఇస్తే అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటానని హామీ ఇచ్చారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు. దీంతో.. ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దం కావాలని గవర్నర్ విజయ్ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON