కరీంనగర్ పట్టణంలో బీజేపీ నేతలు రెచ్చిపోయారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్‌పై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. కిటికీల అద్ధాలు పగులగొట్టారు. హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ ముగిసిన 10 నిమిషాలకే బీజేపీ నాయకులు, కార్యకర్తలు దాడికి పాల్పడి కౌశిక్ రెడ్డి వాహనం ధ్వంసం చేశారు. కౌశిక్ రెడ్డిపై సైతం దాడికి యత్నించారు.

