సమాచార, పౌర సంబంధాల శాఖపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐ అండ్ పీ ఆర్ వ్యవస్థ సరిగ్గా పని చేయకుండా, ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఎందుకు ఉపయోగించుకోవడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని స్థానికంగా ఉండే ఇన్ఫ్లుయెన్సర్ల సహాయంతో ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. కొందరు అధికారుల పనితీరు అభివృద్ధిని అడ్డుకునేలా ఉందని, ఇది సరికాదన్నారు. అధికారులు తమ తీరు మార్చుకుని అభివృద్ధికి ఊతమివ్వాలని హితవు పలికారు.