రాష్ట్రంలో క్షేత్రస్థాయి పాలనను బలోపేతం చేసేందుకు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. “గ్రామ, పట్టణ స్థాయిలో ప్రభుత్వ పనితీరు ప్రజలకు నేరుగా అనుభవంలోకి రావాలి. మౌలిక వసతులు, తాగునీరు, రోడ్లు, పారిశుధ్యం వంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి” అని కలెక్టర్లకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలను పెండింగ్‌లో ఉంచవద్దని, స్థానిక ఎన్నికల నాటికి ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి సంతృప్తి ఉండాలని స్పష్టం చేశారు.