ముంబైలో పుచ్చకాయ తిని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు మృతి చెందిన ఘటనలో మృతుల శరీర నమూనాలను పరీక్షించిన అధికారులు, వారి మరణానికి ఎలుకల మందులో ఉండే ‘జింక్ ఫాస్ఫైడ్’ అనే అత్యంత ప్రమాదకరమైన పదార్థమే కారణమని తేల్చారు. పుచ్చకాయ తినడం వల్ల ఈ మరణాలు సంభవించలేదని, ఆ ఆహారంలో విషం కలిసి ఉండటం వల్లే వారు ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ధ్రువీకరించారు. ఎవరైనా కావాలనే ఆహారంలో విషం కలిపి వారిని అంతమొందించారా? ఈ రెండు కోణాల్లోనూ పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు.