రాష్ట్రంలో కొత్తగా 17 కార్పొరేషన్ ఛైర్మన్లను భర్తీ చేయడంపై సీఎం రేవంత్ రెడ్డిని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. ‘కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ, నిధులు విడుదల చేయడంలో లేదు. నిధులు, విధులు లేకుండా కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న 33 కార్పొరేషన్లకు నిధులు కేటాయించడం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోంది. ఇప్పుడు మరికొందరికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడం హాస్యాస్పదం’ అని విమర్శించారు.