తమిళనాడు రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన నటుడు విజయ్(Vijay) టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుండగా గవర్నర్ షాకిచ్చారు. మ్యాజిక్ ఫిగర్ లేని కారణంగా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించలేనని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 118 మంది జాబితాను తీసుకుని రావాలని సూచించారు. ప్రస్తుతం విజయ్ 112 మందితో కూడిన జాబితాను ఇచ్చారు. మ్యాజిక్ ఫిగర్ కు మరో ఆరుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం.