దళపతి విజయ్ తాను గెలిచిన తిరుచ్చి ఈస్‌కు సీటుకు రాజీనామా చేయనున్నారు. అయితే అక్కడ త్రిషకు ఛాన్స్ ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆయన మాత్రం టఫ్ ఆఫీసర్‌ను సెలెక్ట్ చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. అవినీతిపరులను వణికించిన ఐఏఎస్ అధికారి యు. సాగయంకు టికెట్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన నిజాయితీ గల అధికారిగా పేరు తెచ్చుకున్న మాజీ ఐఏఎస్ అధికారి సాగయంను బరిలో దించడం విజయ్ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు.