తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే మెజార్టీ మార్కు 118 సీట్లు. అయితే విజయ్ పార్టీ టీవీకే 107 సీట్లు మాత్రమే గెల్చుకుంది. వీరికి కాంగ్రెస్ 5 సీట్ల మద్దతు లభించింది.కాంగ్రెస్ తో కలుపుకుని టీవీకేకు ఉన్న 112 సీట్లతోనే ప్రభుత్వ ఏర్పాటు చేస్తామంటూ తెలిపారు. కేబినెట్ ప్రమాణ స్వీకారం తర్వాత రెండు వారాల సమయం ఇస్తే అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకుంటామని విజయ్.. గవర్నర్ అర్లేకర్ కు తెలిపారు. దీంతో ఆయన కూడా అందుకు అంగీకరించి ప్రభుత్వ ఏర్పాట్లు చేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.