ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల బోర్డు సమావేశం జరిగింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు ఇందులో ఆమోదం తెలిపారు. విశాఖలో రూ.లక్ష కోట్లతో రిలయన్స్ డేటా సెంటర్ ఏర్పాటుకు పచ్చ జెండా ఊపారు. శ్రీసత్యసాయి జిల్లాలో రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. కడపలో రూ.12 వేల కోట్లతో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తిరుపతిలో రూ.2,500 కోట్లతో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ల తయారీ పరిశ్రమ పెట్టేందుకు ఆమోదం తెలిపారు.