డీలిమిటేషన్ పై బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. డీలిమిటేషన్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని.. కెసిఆర్ నాయకత్వంలో తిరుగుబాటు మొదలవుతుందని కెటిఆర్ హెచ్చరించారు.కెసిఆర్ ముందుండి ఈ ఉద్యమాన్ని నడుపుతారని అన్నారు.బిజెపి, తెలంగాణకు ఎన్నడూ మంచి చేయదన్నారు. మహిళా రిజర్వేషన్ విషయంలో తాము మద్దతు ఇస్తామని.. బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు శాసనసభలో, శాసన మండలిలో తీర్మానం చేసి పంపించామని కెటిఆర్ గుర్తు చేశారు.

