విజయవాడ ఉగ్ర లింకుల కేసులో పోలీసు కస్టడీలో నిందితుల విచారణ కొనసాగుతుంది. నిందితుల నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. భవిష్యత్తులో ముజాహిద్దీన్లుగా మారేందుకు కూడా తాము సిద్ధపడ్డామని నిందితులు వెల్లడించారు. వారందరి నోట భారత్లో ఇస్లామిక్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచననే కీలమనే మాట వెల్లడైంది. లక్ష్య సాధన కోసం ఆత్మాహుతి దాడులకు సిద్ధపడాలని తాము నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాము జిహాదీ భావజాలానికి ఆకర్షితులయ్యామని సామాజిక మాధ్యమాల్లో ఆ విషయాలకు సంబంధించి విస్తృతంగా పోస్టులు పెట్టామని నిందితులు వెల్లడించినట్లు తెలిసింది.

