రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27)లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్‌ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. విద్యార్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు, మే 14వ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు జరగనుంది.
.

