తాగు, సాగునీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో కరెంట్ రాక, సరిపడా నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయి. మరోవైపు తాగు నీటి కోసం మహిళలు బిందెలతో మైళ్ల దూరం ప్రయాణించిచాల్సిన దుస్థితి నెలకొంది. పది రోజులుగా మంచినీటి సరఫరా లేకపోవడంతో ఖాళీ బిందెలతో జడ్చర్ల మున్సిపాలిటీ ఎదుట పాత బజార్ మహిళలు ధర్నాకు దిగారు. తమ కాలనీలో ఒక్క బోరు కూడా లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు.

