స్టాక్ మార్కెట్ల పై మళ్లీ యుద్ధం దెబ్బ పడింది. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడం దేశీయ స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో 76,134 పాయింట్ల వద్ద ప్రారంభమైన బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్.. ఏకంగా 1,415 పాయింట్లు కోల్పోయింది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ సైతం 479 పాయింట్లు కోల్పోయి 23,571 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

