loader

రాజ్‌కోట్‌లోని గధ్కా గ్రామం నుంచి దేకావాలాలోని మహాదేవ్ ఆలయానికి నడుచుకుంటూ వెళ్తున్న యాత్రికులు.. మార్గమధ్యలో భాస్కర్‌పారా సమీపంలో ఓ వ్యక్తి రోడ్డుపై ఆగిపోయిన డంపర్‌కు టైరు మారుస్తున్నాడు. యాత్రికులు ఆ డంపర్‌ను దాటుతున్న సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన ట్రక్కు వారిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఐదుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. అదేవిధంగా డంపర్‌ టైరు మారుస్తున్న డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON