రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూక్ నగర్ మండలం దూసకల్ గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి పరీక్షల్లో ఫెయిల్ కావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న అభి యాదవ్ అనే విద్యార్థి రెండు సబ్జెక్టులలో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడనీ గ్రామస్తులు పేర్కొన్నారు. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య విషయం తల్లిదండ్రులు అదేవిధంగా కళాశాల యాజమాన్యం బయటకు సమాచారం తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

