లోక్‌సభలో సీట్ల సంఖ్యను పెంచేందుకు చేపట్టిన నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ ‘రాజ్యాంగంపై దాడి’ గా అభివర్ణించారు. అదేవిధంగా ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ కు సవరణను ప్రవేశపెట్టిన సమయంపై కేంద్రాన్ని ఆమె ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని ప్రతిపక్షాలు కోరినా కేంద్రం తిరస్కరించిందని ఆరోపించారు. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ‘ఆధిపత్య ధోరణికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.

