భారతదేశంలోని పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్లో గల ఒక పబ్లిక్ గార్డెన్ జలియన్ వాలాబాగ్. 1919 ఏప్రిల్ 13 న పంజాబీ న్యూ ఇయర్. ఈ సందర్భంగా ఈ ఉద్యానవనంలో సమావేశమైన శాంతియుత వేడుకరులను బ్రిటిష్ దళాలు చుట్టుముట్టి వారిపై మారణకాండ జరిపింది, ఇక్కడ జరిగిన ఈ దురంతమే జలియన్ వాలాబాగ్ దురంతం. ఈ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్ధం 1951 లో ఒక స్మారకం స్థాపించబడింది. ఈ స్మారకం జాతీయ ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ 6.5 ఎకరాల గార్డెన్, సిక్కుల పవిత్ర పుణ్యకేత్రమైన స్వర్ణ దేవాలయానికి సమీపంలో ఉంది.

