హజ్ యాత్రకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. ఏప్రిల్ 13 నుంచి అధికారిక అనుమతులు లేని విదేశీ యాత్రికులు, స్థానికంగా నివాసం ఉంటున్న విదేశీ పౌరులు మక్కాలోకి ప్రవేశించకుండా నిషేధం విధించింది. పని అనుమతులు, మక్కా జారీ చేసిన నివాస గుర్తింపు కార్డు, లేదా చెల్లుబాటు అయ్యే హజ్ అనుమతి పత్రాలు లేని వ్యక్తులను మక్కాలోకి అనుమతించబోమని అధికారులు వెల్లడించారు. మరో వైపు ఉమ్రా వీసాలపై ఉన్న విదేశీ యాత్రికులు ఏప్రిల్ 18కల్లా దేశం విడిచి వెళ్లాలని సౌదీ అధికారులు ఆదేశించారు.

