జేడీయూ అధ్యక్షుడు, బిహార్ సీఎం నీతీశ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ఈసారి రాజ్యసభ ఎన్నికల కోసం తాను నామినేషన్ దాఖలు చేస్తానని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వానికి తన పూర్తి సహకారాన్ని అందిస్తానని తెలిపారు. నీతీశ్ చేసిన ఈ ప్రకటనతో, ఆయన సీఎం పదవి నుంచి వైదొలగుతారనే అంశంపై క్లారిటీ వచ్చింది. 2005 నుంచి నాన్ స్టాప్‌గా బిహార్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న నీతీశ్, త్వరలోనే దేశంలోని పెద్దల సభలోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.

