ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడులు ఆరో రోజు కొనసాగుతున్నాయి. రాజధాని టెహ్రాన్‌పై మరో దఫా వైమానిక దాడులు మొదలుపెట్టామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మృతి చెందిన ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు వాయిదా పడ్డాయి. లక్షలాది సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉండటంతో , అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడానికి సమయం పడుతుందని ఇస్లామిక్ డెవలప్మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అధిపతి మోహసిన్ ప్రభుత్వ మీడియాకు వెల్లడించారు. త్వరలో అంత్యక్రియల తేదీని ప్రకటించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

