ఇరాన్లో ఇవాళ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై 4.3 తీవ్రతగా నమోదు అయ్యింది. దక్షిణ ఇరాన్‌లోని ఫార్స్ ప్రావిన్సులో ఉన్న ఖోంజ్ వద్ద భూకంప కేంద్రం ఉన్నది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదు అయినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే పేర్కొన్నది. స్థానిక కాలమానం 10.24 నిమిషాలకు భూకంపం వచ్చినట్లు తెలుస్తోంది. గీరశ్ అనే పట్టణానికి 55 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నది. 4.3 తీవ్రత భూకంపాన్ని స్వల్ప స్థాయి నుంచి మధ్యస్థాయి ప్రకంపనగా భావిస్తారు.

