భారత బ్యాడ్మింటన్ దిగ్గజం, పీవీ సింధు, ప్రతిష్టాత్మక ‘ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్’లో పాల్గొనేందుకు ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్ వెళుతున్న సింధు, శనివారం దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకుపోయారు. ట్రాన్సిట్ హబ్‌గా ఉన్న దుబాయ్ చేరుకున్న తర్వాత ఆమె ప్రయాణించాల్సిన విమానం రద్దు కావడంతో అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. యుద్ధ వాతావరణం కారణంగా సింధుతో పాటు వేల సంఖ్యలో ప్రయాణికులు ఎయిర్‌పోర్టులోనే ఉండిపోవాల్సి వచ్చింది

