పొట్టి ప్రపంచకప్ నుంచి పాకిస్థాన్ నిష్క్రమించింది. సెమీఫైనల్ బెర్తుపై కన్నేసిన పాక్ భారీ తేడాతో శ్రీలంకను ఓడించలేకపోయింది. ఓపెనర్ ఫర్హాన్(100) సెంచరీతో పల్లెకెలె స్టేడియంలోభారీ స్కోర్ చేసినా.. బౌలర్లు శ్రీలంకను 147లోపు కట్టడి చేయలేకపోయారు. 212 రన్స్ కొట్టినా పాకిస్థాన్ బంతితో మాత్రం శ్రీలంకను పడగొట్టలేకపోయింది. మైనస్ రన్ రేటులో ఉండడంతో లంకను 147లోపే కట్టడి చేస్తేనే పాక్ సెమీస్ దూసుకెళ్లే పరిస్థితి.కానీ, పవన్ రత్ననాయకే(58), కెప్టెన్ దసున్ శనకతో కీలక భాగస్వామ్యం నెలకొల్పి.. పాక్ ఆశలను గల్లంతు చేశాడు.

