అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ స్పందించింది.. యుద్ధం మీరు ప్రారంభించారు.. మేం ముగిస్తాం..అంటూ పేర్కొంది. ఊహించని రీతిలో యుద్ధానికి ముగింపు ఉంటుందని ఇరాన్ ప్రకటించింది. అంతేకాకుండా.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ కూడా ప్రతిదాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్‌అవీవ్‌పై మిస్సైల్ దాడులు చేసింది. ఇజ్రాయెల్‌పై 30 మిస్సైళ్లను ఇరాన్ ప్రయోగించినట్లు తెలుస్తోంది.ఇరాన్‌పై తమ బలగాలు కూడా దాడులు చేశాయని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా దళాలు సైనిక చర్యను ప్రారంభించాయి.. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్‌ను అణుశక్తిగా మారనివ్వం.. అమెరికన్లను రక్షించడమే మా కర్తవ్యం.. అంటూ ట్రంప్ పేర్కొన్నారు.

